![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika deepam 2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -652 లో..... దశరథ్ దగ్గరున్న డబ్బులు తీసుకొని వైరా మనిషి వెళ్ళిపోతాడు. అది చూసి దశరథ్ షాక్ అవుతాడు. దాస్, పోలీసులు అక్కడికి వస్తారు. ఇలా డబ్బులు తీసుకొని వెళ్లారు జ్యోత్స్నను వదిలేస్తారో లేదో అని దశరథ్ టెన్షన్ పడుతడు. మరొకవైపు వాళ్ళని ఫాలో అవుతూ.. పారిజాతం, కార్తీక్ వెళ్తారు. అదంతా చూసి ఇప్పుడు మనం ప్లాన్ మార్చాలని ఇద్దరు ఎక్కడికో బయల్దేరతారు.ఆ తర్వాత రౌడీ డబ్బులు తీసుకొని వైరా దగ్గరికి వెళ్తాడు. ముందు ఆ బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయో లేదో చూడమని జ్యోత్స్న అంటుంది. బ్యాగ్ ఓపెన్ చేసేసరికి అందులో డబ్బులు ఉంటాయి.. అవి చూసి వైరా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
నా వాటా నాకు ఇచ్చి నన్ను వదిలెయ్యండి అని జ్యోత్స్న అనగానే అందరు నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారని జ్యోత్స్న అడుగుతుంది. ఇప్పుడు నిన్ను మోసం చేసామని వైరా అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఒక ఆడపిల్లని ఇలా మోసం చెయ్యొచ్చా అని జ్యోత్స్న అనగానే నువ్వు ఆడపిల్లవి కాదు కిలాడీ పిల్లవి అని వైరా అంటాడు. ఆ తర్వాత అక్కడికి పారు, కార్తీక్ ఎంట్రీ ఇస్తారు. అప్పటికే వైరా వాళ్ళు మాస్క్ వేసుకొని ఉంటారు. ఎవర్రా మీరు అని వైరా మాస్క్ ని కార్తీక్ తీసేస్తాడు. వైరాని చూసి కార్తీక్ షాక్ అవుతాడు.రౌడీలని కార్తీక్ కొడుతుంటే డబ్బులు తీసుకొని పారిపోవాలని వైరా అనుకుంటాడు. జ్యోత్స్న అడ్డుపడడంతో తన తలపై గన్ పెడుతాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. వైరా గన్ షూట్ చేస్తాడు ఆ తర్వాత జ్యోత్స్న ఇంటికి వెళ్తుంది. తనని చూసి సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. జ్యోత్స్న చేతికి రక్తం ఉంటుంది. ఏమైందని సుమిత్ర అడుగుతుంది. బావని షూట్ చేశారు అనగానే అందరు షాక్ అవుతారు. బావకి ఏమైందని దీప టెన్షన్ పడుతుంటే కార్తీక్ చేతికట్టుతో ఇంటికి వస్తాడు. తనతో పోలీసులు కూడా వస్తారు. అసలు ఏం జరిగిందో కార్తీక్ చెప్తాడు.
కార్తీక్ లేకపోతే ఈ రోజు మీ మనవరాలు ఉండేది కాదని పోలీసులు అంటారు. అవును బావ రావడం వల్లే నేనున్నాను.. నన్ను షూట్ చేశారు.. బావ అడ్డు వచ్చాడని జ్యోత్స్న చెప్తుంది. ఎందుకు రిస్క్ చేసావ్ పారిజాతం కూడా వచ్చిందా అని శివన్నారాయణ అంటాడు. పారిజాతం భయంతో బయటే ఉంటుంది. డబ్బుల కోసం ఇదంతా అని దశరథ్ అనగానే లేదు మావయ్య ఇదంతా పగ కోసం ఆ వైరా చేసాడని కార్తీక్ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఇక కోపంగా శివన్నారాయణ గన్ తో వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |